గుజరాత్‌ సర్కార్‌కు ఎదురుదెబ్బ

12 May, 2020 15:03 IST|Sakshi

బీజేపీ మంత్రి ఎన్నిక కొట్టివేత

అహ్మదాబాద్‌ : గుజరాత్‌లో పాలక బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బీజేపీ ఎమ్మెల్యే భూపేంద్రసింగ్‌ చుడాసమా ఎన్నిక చెల్లదని గుజరాత్‌ హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల ఓట్ల లెక్కింపులో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఆయన ఎన్నిక చట్టవిరుద్ధమని, అది చెల్లదని హైకోర్టు పేర్కొంది. 429 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను అక్రమంగా రద్దు చేశారని ఆయన ప్రత్యర్ధి అశ్విన్‌ రాథోడ్‌ వాదనను సమర్ధిస్తూ హైకోర్టు జడ్జి జస్టిస్‌ పరేష్‌ ఉపాథ్యాయ్‌ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. అహ్మదాబాద్‌ జిల్లాలోని డోక్లా నియోజకవర్గం నుంచి భూపేందర్‌ సింగ్‌ చుడాసమ 327 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో గెలుపొందారు.

చదవండి : శ్రామిక్ రైలులో ఆగిన గుండె

మరిన్ని వార్తలు