హోళీకి దూరమైన రాజకీయ నేతలు!

17 Mar, 2014 14:15 IST|Sakshi
హోళీకి దూరమైన రాజకీయ నేతలు!
దేశవ్యాప్తంగా ప్రజలందరూ హోళీ రంగుల్లో మునిగి తేలుతుంటే  ముగ్గురు నేతల మాత్రం వేడుకలకు దూరంగా ఉన్నారు. ఇటీవల బాలీవుడ్ నుంచి రాజకీయాల్లోకి దిగుమతైన గుల్ పనాగ్, మరో నేత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ లు వివిధ కారణాలతో హోళీ వేడుకలకు దూరంగా ఉన్నారు. 
 
నీటి కొరత కారణంగా ఆమ్ ఆద్మీ పార్టీ తరపున చంఢీఘడ్ లోకసభ స్థానం నుంచి పోటీ చేయనున్న గుల్ పనాగ్ ఇష్టమైన హోళీ పండగకు దూరంగా ఉన్నాను అని ట్వీట్ చేశారు. అంతేకాకుండా సహజసిద్దమైన రంగులతో హోళీని ఎంజాయ్ చేయండి.. ముఖ్యంగా మహిళలు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని విజ్క్షప్తి చేస్తూ.. హోళీ శుభాకాంక్షలు తెలిపింది. 
 
సాంప్రదాయ పద్దతిలో బీహార్ లో లక్షలాది మంది హోళీ వేడుకల్లో మునిగి తేలారు. అయితే సరన్ జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతంలోని ఓ స్కూల్ లో మధ్యాహ్న భోజన  తిని 23 మంది పిల్లలు చనిపోయిన ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ హోళీ పండగకు దూరంగా ఉన్నారు. ఇప్పడు బట్టలు చింపుకునేలా ప్రతి ఏటా హోళీ ఆడే లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కారణంగా ఈ సారి హోళీ పండగకు దూరంగా ఉన్నారు. 
మరిన్ని వార్తలు