పాక్‌ జాతీయ స్వీటు గులాబ్‌ జామూన్‌!

9 Jan, 2019 01:42 IST|Sakshi

అది విదేశీ స్వీటని నెటిజన్ల వాదన

పాకిస్తాన్‌లో తాజాగా ఎన్నికలు జరిగా యి. అయితే, మీరెన్నడూ కనీవినీ ఎరుగని ఎన్నికలవి. పాక్‌ జాతీయ స్వీటు ఎంపిక కోసం జరిగిన ఈ ఎన్నికల్లో అభ్యర్థులు మాత్రం.. గులాబ్‌ జామూన్, బర్ఫీ, జిలేబీ. జాతీయ స్వీటుగా గులాబ్‌ జామూన్‌ను నెటిజన్లు ఎన్నుకున్నారు. పాక్‌ ప్రభుత్వం ఆ దేశ నేషనల్‌ స్వీట్‌ ఎన్నికలో ట్విట్టర్‌ ద్వారా పాల్గొనా ల్సిందిగా ప్రజలను కోరింది. ఈ ట్విట్టర్‌ పోల్‌లో ప్రజలు తమ ఓటుహక్కును ఉపయో గించుకొని గులాబ్‌ జామూన్‌కు పట్టం కట్టారు. 47 శాతం మంది పాక్‌ ప్రజలు గులాబ్‌జామ్‌కే ఓటు వేయడంతో ఆ దేశపు జాతీయ స్వీటుగా గులాబ్‌ జామూన్‌ని ప్రకటించారు. 34 శాతం ఓట్లతో జిలేబీ ద్వితీయ స్థానంలో, బర్ఫీ 19 శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలిచాయి. రిగ్గింగ్‌ జరిగింది.

నేషనల్‌ స్వీట్‌పోల్‌లో ఓటింగ్‌ నిజాయితీగా సాగలేదనీ, రిగ్గింగ్‌ జరిగిందనీ పాక్‌ ప్రజలు భావిస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం 5 లక్షల కన్నా తక్కు వమంది ఫాలోవర్స్‌ ఉన్న అధికారిక ట్విట్టర్‌ నుంచే పోల్‌ నిర్వహించడం వారి వ్యతిరేకతకు కారణం. ట్విట్టర్‌ మినహా ఈ ఎన్నికల్లో ఇతర సోషల్‌ మీడియాకు అవకాశం లేకపోవడంపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. అసలు గులాబ్‌ జామూన్‌ పాకిస్తానీ స్వీటు కాదన్నది  కొందరి వాదన. దీన్ని మొగలుల కాలంలో షాజహాన్‌ వంటవారు కనుగొన్నారని కొందరంటోంటే, మధ్య ఆసియా నుంచి దండెత్తిన టర్కీ ఆక్రమణదారుల ద్వారా ఈ పాక్‌లోకి వచ్చిందని కొందరు ఆరోపిస్తున్నారు. మొత్తంగా జామూన్‌ పాకిస్తానీ స్వీటు కాదనీ, దీనికి విదేశీ రుచులున్నాయన్నది వీరి వాదన.

మరిన్ని వార్తలు