సీబీఐ వివాదంపై స్పందించిన జీవీఎల్‌

24 Oct, 2018 20:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)లో నెలకొన్న వివాదంపై బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు ట్విటర్‌ వేదికగా స్పందించారు. సీబీఐలో నెలకొన్న సంక్షోభం వెనుక ప్రతిపక్షాల కుట్ర ఉన్నట్టు ఆయన ఆరోపించారు. కాంగ్రెస్‌ తమ పార్టీ నాయకులను కేసుల నుంచి తప్పించటానికి సంస్థని టార్గెట​ చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పంచన చేరిన టీడీపీ అదే తరహా వంచన రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. 

సీవీసీ(సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌) సలహా మేరకే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం సీబీఐని ప్రక్షాళన చేయటం జరుగుతోందని అన్నారు. సీవీసీ సూచనల ప్రకారమే సీబీఐలో మార్పులు జరిగాయని పేర్కొన్నారు. సీబీఐ తాత్కాతిక డైరక్టర్‌ మన్నెం నాగేశ్వర్‌రావు తెలుగువారేనని తెలిపారు. టీడీపీ చేసే విమర్శలు కాంగ్రెస్‌తో పొత్తు కోసం టీడీపీ తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టినట్టు ఉందని అన్నారు. దీని ద్వారా ఎన్టీఆర్‌ ఆత్మ క్షోభిస్తుందని అభిప్రాయపడ్డారు. 
 

మరిన్ని వార్తలు