కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యాలయంలో జిమ్‌

23 Feb, 2017 00:38 IST|Sakshi
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యాలయంలో జిమ్‌

ప్రారంభించిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు

సాక్షి,న్యూఢిల్లీ: ఢిల్లీలోని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యాలయం నిర్మాణ్‌ భవన్‌లో ఉద్యోగుల దేహదారుఢ్యాన్ని పెంచేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వ్యాయామశాలను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు బుధవారం ప్రారంభించారు. వ్యక్తి ఆరోగ్యం, మానసిక స్థితిపై ఫిట్‌నెస్‌ ప్రభావం అధికంగా ఉంటుందని మంత్రి అన్నారు. ప్రస్తుత జీవనశైలిలో ఉద్యోగులకు తాము పనిచేస్తున్న కార్యాలయాల్లో ఈ విధమైన వ్యాయామ సౌకర్యాలు ఉండడం వల్ల వారి ఫిట్‌నెస్‌ మరింత మెరుగుపడుతుందన్నారు.

ఉద్యోగులు ఈ సౌకర్యాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు. సుమారు రూ.5 లక్షలతో ఏర్పాటైన వ్యాయామశాలను మంత్రిత్వ శాఖలోని దాదాపు 500 మంది ఉద్యోగుల సౌలభ్యం కోసం ఆఫీసు పనివేళల తర్వాత తెరిచి ఉంచుతారు. మంత్రిత్వ శాఖలో ని ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా వ్యాయామశాల ప్రారంభించడం ఇదే మొదటిసారి.

మరిన్ని వార్తలు