హ్యాక్ ద హ్యాకర్స్

17 May, 2015 02:43 IST|Sakshi
హ్యాక్ ద హ్యాకర్స్

ఆన్‌లైన్‌లో మాటువేసే హ్యాకర్లను బెంగళూరు పోలీసులు రెడ్ కార్పెట్ పరచి మరీ ఆహ్వానిస్తున్నారు. మెగా సైబర్ క్రైమ్‌లకు అడ్డుకట్ట వేయడంలో సహకరించాలని కోరుతున్నారు. ‘వైట్ హ్యాట్ హ్యాకర్స్ సంగతి చూద్దాం.. మాతో చేయి కలపండి’ అంటూ బెంగళూరు డీసీపీ అభిషేక్ గోయల్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు కూడా. ఐటీ క్యాపిటల్‌గా విరాజిల్లుతున్న బెంగళూర్‌లో హ్యాకర్స్ బెడద కూడా ఎక్కువగానే ఉంది. ముల్లును ముల్లుతోనే తీయాలన్న సూత్రాన్ని ఎంచుకున్న బెంగళూరు పోలీసులు.. సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయడానికి హ్యాకర్స్‌ను వాడుకోవాలని ఫిక్సయింది.
 

మరిన్ని వార్తలు