కశ్మీర్ అల్లర్లలో లష్కరే పాత్ర: సయీద్

29 Jul, 2016 19:37 IST|Sakshi

లాహోర్: కశ్మీర్ తాజా అనిశ్చితిలో పాక్ ప్రేరేపిత లష్కరే ఉగ్రసంస్థ పాలు పంచుకుందని మరోమారు స్పష్టమైంది. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వాని ఎన్‌కౌంటర్ తరువాత.. అంతిమయాత్రను భారీ ఎత్తున నిర్వహించింది లష్కరే ఉగ్రవాది అమీర్ అబూ దుజానా అని ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ వెల్లడించాడు.

‘కశ్మీర్లో లక్షలాదిగా తరలివచ్చిన బుర్హాన్ వానీ అంతిమయాత్రను దిగ్విజయంగా నిర్వహించింది మరెవరో కాదు.. మన లష్కరేకు చెందిన అమీర్’ అని సయీద్ పేర్కొన్నాడు. అలాగే, కశ్మీర్ అల్లర్ల సమయంలో కశ్మీర్ లోయ నుంచి వేర్పాటు వాద నేత ఆసియా అంద్రాబీ తనకు ఫోన్ చేసి సాయం కోరారని వెల్లడించాడు. ‘అంద్రాబీ నాకు ఫోన్ చేసి.. మేం కష్టాల్లో ఉన్నాం. మా పాకిస్తానీ సోదరులెక్కడ అని ప్రశ్నించింది. ఆ వెంటనే మేం పని ప్రారంభించాం. రెండు, మూడు రోజుల్లోనే ఫైసలాబాద్ నుంచి కొందరిని కశ్మీర్ పంపించాం’ అని హఫీజ్ సయీద్ తెలిపాడు.

మరిన్ని వార్తలు