‘హంపి’ ఎంత పనిచేసింది...

5 May, 2019 19:58 IST|Sakshi

కర్ణాటకలో హంపి ఎక్స్‌ప్రెస్‌ రైలు ఆలస్యం..

సాక్షి, బెంగళూరు : ‘నువ్వు ఎక్కదలుచుకున్న రైలు ఒక జీవిత కాలం లేటు’  అని ఆరుద్ర అన్నట్లుగానే...రైలు ఆలస్యం కారణంగా సుమారు 500మంది విద్యార్థులు ‘నీట్‌’  పరీక్షకు దూరమయ్యారు. కర్ణాటకలో హంపి ఎక్స్‌ప్రెస్‌ సుమారు ఆరు గంటల పాటు ఆలస్యంగా రావడంతో విద్యార్థులు భవితవ్యం సందిగ్ధంగా మారింది. షెడ్యూల్‌ ప్రకారం రావాల్సిన హంపి రైలు ఆదివారం ఆరు గంటలు ఆలస్యంగా నడవటంతో విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకోలేకపోయారు. వీరంతా ఉత్తర కన్నడ నుంచి బెంగళూరుకు హంపి ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరారు.

ఉదయం ఏడింటికి బెంగళూరు చేరుకోవాల్సిన ట్రైన్‌.. మధ్యాహ్నం రెండున్నరకి వచ్చింది. ఒంటిగంటన్నరలోపు పరీక్ష కేంద్రాలకు రానందుకు అక్కడి అధికారులు విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు. అంతకు ముందు రైలు ఆలస్యంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు... కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రితో పాటు, రైల్వే మంత్రికి మెసేజ్‌లు పంపించినా స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆదివారం నీట్‌ నిర్వహించిన విషయం తెలిసిందే.

మరోవైపు ఈ ఘటనపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య తీవ్రస్థాయిలో కేంద్రంపై విరుచుకుపడ్డారు. పరీక్ష రాయలేకపోయిన విద్యార్థులకు తిరిగి నీట్‌ నిర్వహించాలంటూ ఆయన డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీపై సిద్దరామయ్య ట్విటర్‌ ద్వారా ధ్వజమెత్తారు. ఇతరులు సాధించిన దానికి కూడా తన ఖాతాలో వేసుకుని జబ్బలు చరుచుకునే మోదీ... ఇటువంటి వైఫల్యాలకు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని ఘాటుగా విమర్శించారు. రైళ్లు సకాలంలో నడవకపోవడం వల్ల వందలాదిమంది విద‍్యార్థులు పరీక్షకు హాజరు కాలేకపోయారని, వారిని మరో అవకాశం ఇవ్వాలని  కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సిద్దరామయ్య కోరారు.

ఇక ఈ ఘటనపై సౌత్‌ వెస్ట్రన్‌ రైల్వే పీఆర్వో మాట్లాడుతూ.. హంపి ఎక్స్‌ప్రెస్‌ ఆలస్యం కారణంగా పరీక్షకు సకాలంలో హాజరుకాలేకపోయిన విద్యార్థులకు తిరిగి నీట్‌ పరీక్ష నిర్వహించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ లేఖ రాయనున్నట్లు తెలిపారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

షీలా దీక్షిత్‌కు సోనియా, ప్రియాంక నివాళులు

కేరళను ముంచెత్తుతున్న భారీ వర్షాలు..!

సింగిల్‌ ఫ్యాన్‌.. 128 కోట్ల కరెంట్‌ బిల్లు

యూపీలో బీజేపీ నేత కాల్చివేత

అమ్మా.. మేం నీ బిడ్డలమే.. గుర్తుపట్టావా?

కర్ణాటకలో రాష్ట్రపతి పాలన?

సీపీఐ కొత్త సారథి డి.రాజా

నాలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు

హస్తిన హ్యాట్రిక్‌ విజేత

షీలా దీక్షిత్‌ కన్నుమూత

చంద్రయాన్‌–2 ప్రయోగం రేపే

షీలా దీక్షిత్‌కు ప్రధాని మోదీ నివాళి

ఈనాటి ముఖ్యాంశాలు

షీలా దీక్షిత్‌ మృతిపై సీఎం జగన్‌ సంతాపం

‘ఆమె కాంగ్రెస్‌ పార్టీ ముద్దుల కూతురు’

కార్యకర్త నుంచి కడవరకూ కాంగ్రెస్‌లోనే

తప్పు కోడ్‌ పంపినందుకు పైలెట్‌ సస్పెండ్‌

సవతి తండ్రిని కాల్చి చంపిన కొడుకు..

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత

​​​​​​​ప్రళయం నుంచి పాఠాలు.. తొలిసారి వాటర్‌ బడ్జెట్‌

నేరుగా షిరిడి సాయిబాబాతో మాట్లాడుతానంటూ..

రాజకీయాలు చేసేందుకే ప్రియాంక అక్కడకు..

జొమాటో, స్విగ్గీ పోటా పోటీ

పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు

కొడుక్కి ఫోన్ ఇవ్వడంతో బండారం బైటపడింది!

మహిళలకు స్పెషల్‌ రివాల్వర్‌: విశేష ఆదరణ

అకృత్యం; చిన్నారి ఆత్మహత్య..సౌదీకి వెళ్లి!

దుమారం రేపుతున్న నిర్భయ దోషి ఫ్లెక్సీ

ఘోర ప్రమాదం.. 9 మంది విద్యార్థుల మృతి..!

గెస్ట్‌హౌస్‌లో ప్రియాంక.. కరెంట్‌, వాటర్‌ కట్‌!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘విజయ్‌తో చేయాలనుంది’

చలికి వణికి తెలుసుకున్నా బతికి ఉన్నాలే

ధమ్కీ ఇవ్వడం పూర్తయింది

నవ్వించే ఇట్టిమాణి

లాయర్‌ మంజిమా

ఎదురు చూస్తున్నా