'పోలీసుల ఒత్తిడి వల్లే అలా మాట్లాడా'

16 May, 2016 16:13 IST|Sakshi
'పోలీసుల ఒత్తిడి వల్లే అలా మాట్లాడా'

హంద్వారా:
వీడియోలో తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలంటూ దూషిస్తూ, తనపై పోలీసులు ఒత్తిడి చేశారని కశ్మీర్‌లోని హంద్వారాలో ఏప్రిల్లో జరిగిన ఆందోళనలకు కేంద్రబిందువైన 16 ఏళ్ల బాలిక సోమవారం వెల్లడించింది. రక్షణా పరమైన చర్యల్లో భాగంగా 27 రోజులు పోలీసుల అదుపులో ఉన్న ఆమెను కోర్టు జోక్యం తర్వాత పోలీసులు విడుదల చేశారు. పోలీసులు ఒత్తిడి చేసి తనను అలా మాట్లాడించారని, దాన్ని వీడియోలో రికార్డు చేసి విడుదల చేశారని ఆమె తెలిపింది. తనకు ఇష్టం లేకుండానే పోలీస్ స్టేషన్లో బంధించి, తెల్లని కాగితాల మీద సంతకాలు కూడా చేపించారని ఆమె తెలిపింది. పోలీసులు బాలికను బెదిరించి తప్పుడు స్టేట్ మెంట్ ఇప్పించారని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు.

బాలికను జవాను వేధించాడని పుకార్లు రావడంతో ఏప్రిల్లో అల్లర్లు ప్రారంభమయిన విషయం తెలిసిందే. భద్రతా బలగాల కాల్పుల్లో ఐదుగురు మృతిచెందడంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అయితే సదరు బాలిక తనపై వేధింపులకు పాల్పడింది జవాను కాదని స్థానికుడే అని వివరణ ఇచ్చిన వీడియోను అధికారులు తర్వాత విడుదల చేశారు. ఆ వీడియోను పోలీసు స్టేషన్‌లోనే తీయగా, మాట్లాడాలంటూ విజ్ఞప్తి చేస్తున్న ఒక పురుషుని గొంతు వినిపించింది. తదనంతరం జరుగుతున్న పరిణామాలతో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వచ్చాయి.

మరిన్ని వార్తలు