హార్దిక్‌ పటేల్‌ అరెస్టు

13 Jun, 2017 11:18 IST|Sakshi
హార్దిక్‌ పటేల్‌ అరెస్టు

న్యూఢిల్లీ: పటేల్‌ ఉద్యమకారుడు హార్దిక్‌ పటేల్‌ అరెస్టయ్యాడు. మంగళవారం ఉదయం మధ్యప్రదేశ్‌లోని నీముచ్‌ జిల్లాలో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. మధ్యప్రదేశ్‌లో రైతులపై కాల్పులు చోటుచేసుకున్న మాంద్‌సౌర్‌ ప్రాంతానికి హార్దిక్‌ వెళుతుండగా పోలీసులు అరెస్టు చేశారు. తమ వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధరలు కల్పించడంతోపాటు పంటరుణాలు ఇప్పించాలని, పాత రుణాలు మాఫీ చేయాలని ఉద్యమం చేస్తున్న రైతులపై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే.

ఈ ఘటనలో ఐదుగురు చనిపోయారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తలు నెలకొని ఆంక్షలు ఉన్నాయి. అక్కడికి ఎవరినీ అనుమతించడం లేదు. దీంతో ఆ రైతులకు సానుభూతిగా గుజరాత్‌లో పటేళ్ల తరుపున ఉద్యమం చేసిన హార్దిక్‌ పటేల్‌ వెళుతుండగా అతడిని అరెస్టు చేశారు. హార్దిక్‌ తన అరెస్టు విషయంలో ముందే మాట్లాడుతూ తన పని తాను చేసుకుపోతానని, పోలీసులు వారి పని వారు చేసుకుంటారని చెప్పారు.

మరిన్ని వార్తలు