ఆ సీఎం పౌరసత్వ వివరాలు లేవు

5 Mar, 2020 16:19 IST|Sakshi

చండీగర్‌ : హరియాణా ముఖ్యమంత్రి పౌరసత్వానికి సంబంధించి ఒక వ్యకి ఆర్టీఐ(సమాచార హక్కు చట్టం) ద్వారా అడిగిన సమాచారానికి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే.. హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖత్తర్, కేబినెట్ మంత్రులు, గవర్నర్‌ల పౌరసత్వానికి సంబంధించిన వివరాలు కావాలంటూ పానిపట్‌క చెందిన ఓ వ్యక్తి లేఖ రాశాడు. పౌరసత్వ లేఖకు సమాధానంగా హరియాణాకు చెందిన ప్రజా సంబంధాల అధికారి (పీఐఓ) స్పందిస్తూ..తమ రికార్డులలో సీఎం, మంత్రుల పౌరసత్వానికి సంబంధించి ఎలాంటి రికార్డులు లేవని తెలిపారు.

పౌరసత్వానికి సంబంధించిన రికార్డులు ఎలక్షన్‌ కమిషన్‌ వద్ద లభ్యమవ్వచ్చని హరియాణాకు చెందిన పీఐఓ అధికారి పేర్కొన్నాడు. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రంలో ఎన్‌ఆర్‌సీని (జాతీయ పౌర పట్టిక) అమలు చేస్తామని సీఎం ఖత్తర్‌ ప్రచారం చేసిన విషయం తెలిసిందే. పాకిస్తాన్, బంగ్లాదేశ్  ఆఫ్ఘనిస్తాన్‌ దేశాలకు చెందిన ప్రజలు మతపరమైన హింస వల్ల హరియాణాలో నివసిస్తున్నారని..వారికి సీఏఏ ద్వారా పౌరసత్వం ఇవ్వవచ్చని గతంలో ఖత్తర్‌ మీడియాలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

చదవండి: వినూత్న నిరసన తెలిపిన పెళ్లికొడుకు

మరిన్ని వార్తలు