కరోనా: చూయింగ్‌ గమ్‌, గుట్కా, పాన్‌లపై నిషేధం

3 Apr, 2020 12:31 IST|Sakshi

హర్యానా: కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు హర్యానా ప్రభుత్వం చూయింగ్‌ గమ్‌ అమ్మకాలను జూన్‌ 30 వరకూ నిషేధించినట్లు తాజాగా ప్రకటించింది. ఉమ్మివేయడం ద్వారా కోవిడ్‌-19 వ్యాపిస్తున్న నేపథ్యంలో చూయింగ్‌ గమ్‌తో పాటు పాన్‌ మసాలా, గుట్కాపై కూడా నిషేధం విధించింది. ప్రభుత్వం ఆదేశించిన ఈ నిషేధాన్ని సమవర్థవంతాగా అమలు చేయాలని అధికారులను కోరింది. ‘కరోనా వైరస్‌ నోటీలోని లాలాజలంతో కూడా వ్యాపిస్తుంది. దీంతో చూయింగ్‌ గమ్‌ తినేవారు ఉమ్మివేయడం వల్ల ఆ లాలాజలం ద్వారా ఇతరులకు కరోనా సోకే అవకాశం ఉంది’ అని రాష్ట్ర ప్రభుత్వ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్టేషన్ శాఖ వెల్లడించింది. (కరోనాకు సవాల్‌: క్యూబా వైద్యుల సాహసం)

అలాగే గత ఏడాదిలో గుట్కా, పాన్‌ మసాలా, పోగాకుపై విధించిన నిషేధాన్ని కూడా ఏడాది పాటు అమలు చేయాలని సదరు డిపార్ట్‌మెంట్‌ అధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో సువాసన, రుచిగల పొగాకు, గుట్కా, పాన్‌ మసాలా, సున్నం(చునా) పంపిణీనిలపై కూడా తనిఖీలు నిర్వహించాలని అధికారులకు సూచించింది. ఇక రాష్ట్రంలో కరోనా అనుమానితులు 13000 మంది ఉన్నారని, వారిపై ప్రత్యేక నిఘా ఉంచి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం కూడా పాన్‌ మసాలా తయారి, అమ్మకాలపై ఇప్పటికే నిషేధం విధించిన సంగతి తెలిసిందే. (ఆ వార్డులన్నీ రెడ్‌ జోన్లు)

మరిన్ని వార్తలు