హర్యానా, మహారాష్ట్రల్లో ఎన్నికల నగారా

13 Sep, 2014 02:39 IST|Sakshi
హర్యానా, మహారాష్ట్రల్లో ఎన్నికల నగారా

* వచ్చేనెల 15న పోలింగ్, 19న ఓట్ల లెక్కింపు
* రెండు లోక్‌సభ, ఐదు అసెంబ్లీ స్థానాలకూ ఉప ఎన్నికలు

 
 సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. అక్టోబర్ 15న ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతాయి. 19 ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు రెండు లోక్‌సభ స్థానాలు, 5 రాష్ట్రాల్లోని 5 అసెంబ్లీ స్థానాలకు కూడా అదేరోజు ఉప ఎన్నికలు జరుగుతాయి. ఢిల్లీలోని నిర్వాచన్ సదన్ కార్యాలయంలో శుక్రవారం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వి.ఎస్.సంపత్ ఎన్నికల షెడ్యూల్ వివరాలను వెల్లడించారు. 90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీ కాలం వచ్చే నెల 27వ తేదీకి, 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీ కాలం నవంబరు 8తో ముగియనుందన్నారు. ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలతో పాటు బీడ్ (మహారాష్ట్ర), కాంధమాల్ (ఒడిశా) లోక్‌సభ స్థానాలకు, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లలో ఒక్కో అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలు జరగనున్నాయి.  
 
 నోటిఫికేషన్ విడుదల: 20-09-14
 నామినేషన్ల స్వీకరణకు తుది గడవు: 27-09-14
 నామినేషన్ల పరిశీలన: 29-09-14
 నామినేషన్ల ఉపసంహరణకు
 ఆఖరు తేదీ: 01-10-2014
 పోలింగ్ తేదీ: 15-10-2014
 ఓట్ల లెక్కింపు: 19-10-14
 ఎన్నికల ప్రక్రియ ముగింపు తేదీ:  22-10-14
 హర్యానాలో ఓటర్ల సంఖ్య: 1,61,58,117
 పోలింగ్ కేంద్రాల సంఖ్య: 16,244
 మహారాష్ట్రలో ఓటర్ల సంఖ్య: 8,25,91,826
 పోలింగ్ కేంద్రాల సంఖ్య: 90,403

మరిన్ని వార్తలు