నోట్లరద్దుతో ప్రయోజనాలు బోలెడు: కేంద్రం

7 Nov, 2017 03:04 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఏడాది క్రితం తీసుకున్న నోట్ల రద్దు ద్వారా చాలా ప్రయోజనాలు జరిగాయని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. నల్లధనాన్ని వెలికితీయటం, దొంగనోట్లను చెలామణిలోనుంచి తీసేయటం, నగదు లావాదేవీలను తగ్గించటం వంటి లాభాలు జరిగాయంది. ఉగ్రవాదులు, మావోయిస్టుల ఆర్థిక మూలాలకు తీవ్రమైన నష్టం వాటిల్లిందని.. దీంతోపాటుగా పన్ను పరిధి విస్తృతమవటం, అక్రమంగా సంపాదించినదంతా ఆర్థిక వ్యవస్థలోకి మార్చటం, డబ్బుకు జవాబుదారీ పెంచటం జరిగిందని స్పష్టం చేసింది. డిజిటల్‌ చెల్లింపులకు నోట్లరద్దు నిర్ణయం ఊతమిచ్చిందని.. తద్వారా నగదు రహిత ఆర్థిక వ్యవస్థగా భారత్‌ మారేందుకు ముందడుగు పడిందని తెలిపింది. కాగా నోట్ల రద్దులో కీలకంగా వ్యవహరించిన రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్‌ అధియాను ఆర్థిక శాఖ నూతన కార్యదర్శిగా నియమించారు.

మరిన్ని వార్తలు