హ్యాట్సాఫ్‌.. నరేంద్ర మోదీ!

9 Nov, 2016 09:15 IST|Sakshi
హ్యాట్సాఫ్‌.. నరేంద్ర మోదీ!

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ 500, 1000 కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయాన్ని సినిమా ప్రముఖులు స్వాగతించారు. మోదీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని ప్రశంసల్లో ముంచెత్తారు. పెద్ద నోట్ల రద్దుపై తమ స్పందనను సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశారు.

  • ప్రధాని నరేంద్ర మోదీకి తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ జేజేలు పలికారు. నవీన భారత్‌ ఆవిర్భవించిందని ట్విట్టర్‌ లో పేర్కొన్నారు.

     
  • తన తాజా చిత్రం ’పింక్‌’  కారణంగానే కొత్త 2 వేల రూపాయల నోటును  పింక్‌ రంగులో ముద్రిస్తున్నారని బాలీవుడ్‌ దిగ్గజ నటుడు అమితా​బ్‌ బచ్చన్‌ చమత్కరించారు.

     
  • నల్లధనం దాచినవారు బయటపడక తప్పదని సీనియర్‌ నటుడు పరేశ​ రావల్‌ పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో రూ. 500, రూ.1000 నోట్లు బయటపెట్టక తప్పదని అన్నారు.  
     
  • సంచలనాత్మన నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీకి దర్శకనిర్మాత మధుర్‌ భండార్కర్‌ అభినందనలు తెలిపారు. పెద్ద నోట్లను రద్దు చేయడంతో నల్లధనం వెలికి వస్తుందని అభిప్రాయపడ్డారు. దేశ ఆర్థికవ్యవస్థ బలోపేతం అవుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

     
  • 9/11 రోజున కొంత మంది ఓడిపోతారు. కానీ చాలా మంది గెలుస్తారు. ప్రధాని మోదీ శక్తివంతమైన, సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నార’ని బాలీవుడ్‌ నటుడు సునీల్‌ షెట్టి పేర్కొన్నారు.
     
  • ఈ మార్పును మనమంతా సహృదయంతో స్వాగతించాలి. ప్రతి పౌరుడి  భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిందని హీరో అర్జున్ కపూర్‌ అన్నాడు.
     
  • దేశ నిర్మాణం కోసం ప్రధాని మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు  హీరోయిన్‌ అనుష్క శర్మ తెలిపింది. దేశప్రయోజనాలను దృష్టిలో పెట్టుకున్న ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు అందరూ సహరించాలని కోరింది.

    Hats off @narendramodi ji. New india is born #JaiHind
మరిన్ని వార్తలు