మమతా బెనర్జీకి షాక్‌

28 Apr, 2017 20:15 IST|Sakshi
మమతా బెనర్జీకి షాక్‌

► నారద కేసులో దర్యాప్తు కొనసాగించాలని హైకోర్టు ఆదేశం

కోల్‌కతా: పశ్చిమ బెంగాళ్‌ ముఖ్యమంత్రి, తృణముల్‌ కాంగ్రెస్‌ అధినేతకు కలకత్తా హైకోర్టు షాక్‌ ఇచ్చింది. నరద స్టింగ్‌ ఆపరేషన్‌ పై దర్యాప్తు కొనసాగించాలని కతకత్తా హైకోర్టు సీబీఐనీ ఆదేశించింది. సీబీఐ తనపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌ని  కొట్టేయాలని కోరుతూ తృణముల్‌ ఎంపీ ఆలీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. వరుస అవినీతి ఆరోపణలతో సతమతమవుతోన్న మమత సర్కార్‌కు ఇది గట్టి ఎదరుదెబ్బతగిలింది.

ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) మనీ లాండరింగ్‌ కేసులో మమత సర్కార్‌పై కేసు నమోదు చేసింది. గతేడాది పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ముందు నారద స్టింగ్‌ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియోల్లో  కొందరు తృణముల్‌ కాంగ్రెస్‌ నేతలు డబ్బులు తీసుకుంటున్నట్లుగా దృశ్యాలు ఉన్నాయి. కాగా, ఇవి ట్యాంపర్‌ చేసిన టేపులు కావని చండీగఢ్‌లోని సెంట్రల్‌ ఫొరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరెటరీ (సీఎఫ్‌ఎస్‌ఎల్‌) ఇచ్చిన నివేదికను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది.

ఈ కేసులో రాజ్యసభ ఎంపీ ముఖుల్‌ రాయ్‌, లోక్‌సభ ఎంపీ సౌగాత రాయ్‌, వీరితో సంబంధం ఉన్న పలువురు ఐపీఎస్‌ అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది. సుల్తాన్ అహ్మద్‌, ఇక్బాల్‌ అహ్మద్‌, కకోలి ఘోష్‌, ప్రసూన్‌ బెనర్జీ, సువేందు అధికారి, సోవన్‌ చటర్జీ, సుబ్రత ముఖర్జీ, సయ్యద్‌ హుస్సేన్‌ మీర్జా, ఫిర్హాద్ హకీమ్‌ తదితరులున్నారు. చిట్‌ఫండ్‌ స్కాంతో సంబంధం ఉన్న ఇద్దరు ఎంపీలు సుదీప్ బెనర్జీ, తపస్ పాల్ ఇప్పటికే సీబీఐ అదుపులో ఉన్నారు.

మరిన్ని వార్తలు