చిదంబరానికి ఇంటి భోజనం నో

13 Sep, 2019 04:17 IST|Sakshi

న్యూఢిల్లీ: ఐఎన్‌ ఎక్స్‌ మీడియా కేసులో తీహార్‌ జైలులో ఉన్న సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు చిదంబరానికి ప్రత్యేక ఆహారం ఇవ్వడం కుదరదనీ, జైలులో అందరికీ ఒకే రకమైన ఆహారం ఉంటుందనీ హైకోర్టు స్పష్టం చేసింది. మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం బెయిల్‌ పిటిషన్‌ విచారణలో చిదంబరంకి ఇంటి నుంచి తెప్పించిన ఆహారాన్ని జైలులో అనుమతించాల్సిందిగా ఆయన తరఫున కపిలి సిబాల్‌ కోర్టుని కోరడంతో జస్టిస్‌ సురేష్‌ కుమార్‌ కైత్‌ ‘‘జైలు లో అందరికీ ఒకే రకమైన ఆహారం అందుబాటులో ఉంటుంది’’అని తేల్చి చెప్పారు. అయితే తన క్లయింట్‌ 74 ఏళ్ళ వయస్సువారనీ, అందుకే ఇంటిభోజనాన్ని అనుమతించాలనీ సిబల్‌ వాదించగా సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కలుగజేసుకుంటూ ‘‘ఓమ్‌ప్రకాష్‌ చౌతాలా ఇంకా ఎక్కువ(84 ఏళ్ళు) వయస్సువారు, రాజకీయ ఖైదీ కూడా అయినప్పటికీ ఆయనకు జైలులో సాధారణ భోజనమే అందుతోంది. రాజ్యం ఎవ్వరి పట్లా భేదం పాటించదు’’         అని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు