గజదొంగై ఇద్దరు భార్యలను మెయింటెన్ చేస్తూ..

11 Jul, 2016 13:19 IST|Sakshi
గజదొంగై ఇద్దరు భార్యలను మెయింటెన్ చేస్తూ..

బెంగళూరు: ఇద్దరు భార్యలను పోషించేందుకు ఒక భర్త దొంగ అవతారమెత్తాడు. అప్పటి వరకు కూలీనాలి చేసుకుంటూ బ్రతికిన అతడు రెండు కుటుంబాలను పోషించడంలో ఇబ్బందులు ఎదుర్కోవడంతో స్కూటర్ల దొంగగా మారాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 25 స్కూటర్లు కొట్టేశాడు. వీటి విలువు దాదాపు రూ.15లక్షలు ఉంటుందని పోలీసులు చెప్పారు. వాటన్నింటిని వారు రికవర్ చేసుకున్నాడు. బెంగళూరుకు చెందిన మురళీ రామారావు అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు.

ఒకరికి తెలియకుండా మరొకరితో సంసారం చేయడం మొదలుపెట్టాడు. అయితే, క్రమంగా వారి పోషణ భారం కష్టమై పోయింది. దీంతో అప్పటి వరకు కూలిగా ఉ‍న్న అతడు ఒక్కసారిగా దొంగ అవతారమెత్తాడు. ఒక భార్య దగ్గరకు వెళ్లే సమయంలో బస్సులో వెళుతూ వచ్చే సమయంలో ఓ స్కూటర్ కొట్టేసి దానిపై మరో భార్య వద్దకు వెళ్లేవాడు. అడిగిన ప్రతిసారి తన స్నేహితుల స్కూటర్లు అని చెప్పేవాడు. అయితే, ఈ నెల 5న మంత్రి మాల్ వద్ద హోండా డియో ద్విచక్ర వాహనాన్ని దొంగిలిస్తూ పోలీసులకు పట్టుబడటంతో అసలు విషయం బయటపడింది.

మరిన్ని వార్తలు