మంత్రిగారు గూగుల్ చూసి చెప్పారట!!

15 Sep, 2016 16:30 IST|Sakshi
మంత్రిగారు గూగుల్ చూసి చెప్పారట!!

వైద్య ప్రముఖులు చెప్పేదాని కంటే గూగులమ్మ చెప్పే విషయాల మీదే ఆరోగ్య మంత్రికి నమ్మకం ఎక్కువట. చికన్‌గున్యా వల్ల మరణాలు సంభవించవని, అలాగని గూగుల్ తనకు చెప్పిందని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ చెబుతున్నారు. అందుకే ఢిల్లీవాసులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఆ లక్షణాలు కనపడితే జాగ్రత్తలు తీసుకుని, ఆస్పత్రికి వెళ్తే చాలని చెప్పారు.

అక్కడ వైద్యులు చెబితేనే ఆస్పత్రిలో చేరాలి తప్ప లేకపోతే అక్కర్లేదన్నారు. ఢిల్లీలో ఒకే ఆస్పత్రిలో నలుగురు పేషెంట్లు చికన్ గున్యాతో చనిపోయారని.. మరి దానిగురించి ఏమంటారని ప్రశ్నిస్తే, ప్రపంచంలో ఎక్కడా చికన్ గున్యా మరణాలు లేవని.. కేవలం ఢిల్లీలో ఒక ఆస్పత్రిలోనే ఎందుకు ఉంటున్నాయని ఎదురు ప్రశ్నించడంతో పాటు వాళ్లు అప్పటికే వయసుమీరి, రకరకాల సమస్యలతో బాధపడుతున్నట్లు తన విచారణలో తేలిందని చెప్పుకొచ్చారు.

మరిన్ని వార్తలు