80 ఔషధాలపై నిషేధం

18 Jan, 2019 03:11 IST|Sakshi

జాబితాలో యాంటిబయోటిక్‌లు, నొప్పి నివారిణులు, రక్తపోటును నియంత్రించే డ్రగ్స్‌

న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య శాఖ మరో 80 ఫిక్స్‌డ్‌ డోస్‌ కాంబినేషన్‌(ఎఫ్‌డీసీ) ఔషధాల్ని నిషేధించింది. ఇందులో నొప్పి నివారిణులు, యాంటిబయోటిక్‌లతో పాటు బీపీ, బ్యాక్టీరియా, ఫంగస్‌లతో వ్యాపించే వ్యాధుల చికిత్సకు వాడే మందులున్నాయి. ఈ ఔషధాలపై నిషేధం జనవరి 11నే అమల్లోకి వచ్చిందని తాజాగా నోటిఫికేషన్‌ వెలువడింది. దీంతో నిషేధానికి గురైన మొత్తం ఎఫ్‌డీసీ ఔషధాల సంఖ్య 405కు పెరిగింది.  సెప్టెంబర్‌లో 325 ఔషధాలను నిషేధిత జాబితాలో చేర్చిన సంగతి తెలిసిందే.

ఎఫ్‌డీసీలో రెండు, అంతకంటే ఎక్కువ ఔషధాలు స్థిర నిష్పత్తిలో ఒకే డోస్‌గా ఉంటాయి. తాజాగా నిషేధించిన ఔషధాల జాబితాలో యాంటిబయోటిక్‌లు సెఫ్‌గ్లోబ్‌ ఓజెడ్, టాక్సిమ్‌ ఓజెడ్, బ్యాక్టీరియా, ఫంగస్‌ వ్యాధుల చికిత్సలో వినియోగించే ఓర్‌ఫ్లాజ్‌ కిట్, వెజినోబాక్ట్, హైపర్‌టెన్షన్‌ ఔషధాలైన టెలిప్రిల్‌ హెచ్, లోరమ్‌ హెచ్, యాంటీ యాంగ్జెటి డ్రగ్‌ రెస్టా తదితరాలున్నాయి. డ్రగ్స్‌ టెక్నికల్‌ అడ్వైజరీ బోర్డు సిఫార్సుల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.

మరిన్ని వార్తలు