హెలికాప్టర్‌లో గుండె తరలింపు

24 Feb, 2017 01:31 IST|Sakshi

బెంగళూరులో ఇదే మొదటిసారి
సాక్షి, బెంగళూరు: అవయవదానంలో ప్రతి క్షణం బంగారమే. అందుకే నగరంలోని మొట్టమొదటిసారిగా హెలికాప్టర్‌ అంబులెన్సులో గుండెను తరలించారు. రామనగర్‌కు చెందిన 45 ఏళ్ల మహిళ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బన్నేరుఘట్ట అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం సాయంత్రం ఆమె బ్రెయిడ్‌ డెడ్‌ అయినట్లు వైద్యులు తేల్చారు.అవయవదానానికి ఆమె కుటుంబ సభ్యులను ఒప్పించారు.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 51 ఏళ్ల మహిళ తీవ్రమైన గుండెజబ్బుతో మత్తికెరె వద్ద ఉన్న ఎం.ఎస్‌రామయ్య ఆసుపత్రిలో చికిత్స పొంతున్నారు. ఆమెకు ఈ గుండెను అమర్చాలి. ఇరు ఆసుపత్రుల మధ్య ఉన్న దూరం 17.5 కిలోమీటర్లు. కాగా గురువారం సాయంత్రం సరిగ్గా 5:30 గంటలకు గుండెతో బయల్దేరిన హెలికాప్టర్‌ పదినిమిషాల్లో ఎం.ఎస్‌ రామయ్య ఆసుపత్రి వద్దకు చేరుకుంది. వైద్యులు గుండెమార్పిడి శస్త్రచికిత్సను పూర్తిచేశారు. గుండెను సేకరించడం నుంచి తరలించడం వరకు వైద్యలు, సిబ్బంది ఆగమేఘాలపై నిర్వహించారు. బాధితురాలి కళ్లు, కాలేయం, మూత్రపిండాలను వేరే రోగులకు అమర్చనున్నారు.

మరిన్ని వార్తలు