దేశ రాజధానిని ముంచెత్తిన భారీ వర్షం

2 Sep, 2018 11:45 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ఢిల్లీ-జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్‌)లోని పలు చోట్ల రహదారులపై నీరు నిలిచిపోయింది. ఢిల్లీతో పాటు నోయిడా, గ్రేటర్‌ నోయిడా, ఘజియాబాద్‌, గురుగ్రాం, ఫరీదాబాద్‌ ప్రాంతంలో భారీ వర్షాలతో ట్రాఫిక్‌ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ఢిల్లీలోని భైరాన్‌మార్గ్‌ అండర్‌ రైల్వే బ్రిడ్జ్‌, హనుమాన్‌ సేటు రింగ్‌ రోడ్‌, నేతాజీ సుభాష్‌ మార్గ్‌, ఓఖ్లా సబ్జి మండి, మోది మిల్‌ ప్లైఓవర్‌, బిహారి కాలనీ రైల్వే బ్రిడ్జి, ఎస్‌డీఎం ఆఫీస్‌ నాలా రోడ్డు, గీతా కాలనీ ఫ్లైఓవర్‌ ప్రాంతాలు జలమయమయ్యాయని అధికారులు తెలిపారు. ఐఐటీ హజ్‌ఖాస్‌ నుంచి ఎయిమ్స్‌కు వెళ్లే రహదారిపై భారీ చెట్టుకూలి రోడ్డుపై పడటంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు అవాంతరం ఏర్పడిందని చెప్పారు.

కాగా యమునా బజార్‌ ప్రాంతంలో తాము ప్రయాణిస్తున్న బస్సు నిలిచిపోవడంతో బస్సులో చిక్కుకున్న 30 మంది ప్రయాణీకులను స్ధానికుల సాయం పోలీసులు కాపాడారు. వర్షపు నీటిలో వాహనాలు ముందుకు కదలకపోవడంతో ఢిల్లీలోని ఐటీఓ, రాంలీలా మైదాన్‌, మింటో రోడ్‌ వంటి పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తాయని అధికారులు చెప్పారు.

మరిన్ని వార్తలు