ఎల్‌వోసీ వద్ద ఆర్మీ భారీ ఆపరేషన్‌!

24 Sep, 2017 09:21 IST|Sakshi
భారత ఆర్మీ

శ్రీనగర్‌: ఆర్మీ ఆదివారం ఉదయం ఉగ్రవాదులను ఏరివేసేందుకు భారీ ఆపరేషన్‌ను చేపట్టంది. జమ్మూకశ్మీర్‌  వాస్తవాధీన రేఖ (ఎల్‌వోసీ) సమీపంలోని యూరీ సెక్టార్‌లో ఉగ్రవాదులను మట్టుబెట్టే ఆపరేషన్‌ కొనసాగిస్తోంది.  ఎల్‌వోసీ సమీపంలోని కల్‌గాయ్‌ అడవిలో ముగ్గురు, నలుగురు ఉగ్రవాదులు మాటువేశారని నిఘా వర్గాలు సమాచారం అందించడం భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. ప్రస్తుతం ఉగ్రవాదులు, భద్రతాదళాల మధ్య భారీ ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి.

ఉగ్రవాదులను భద్రతా దళాలు రౌండప్ చేశాయని, ఉగ్రవాదులున్న ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం భారీ ఆపరేషన్‌ కొనసాగుతోందని, పెద్ద ఎత్తున గన్‌ఫైట్‌ జరుగుతోందని ఆ వర్గాలు వివరించాయి.  ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది మృతిచెందాడు. ఇతర ఉగ్రవాదుల కోసం భద్రతా దళాల వేట కొనసాగుతోంది. కాగా, బరాముల్లా జిల్లాలోని షోపూర్‌లోని ఎస్బీఐ బ్యాంకు వద్ద ఉగ్రవాదులు గ్రనేడ్‌ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ముగ్గురికి గాయాలు అయ్యాయి.
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు