రాగల 24 గంటల్లో.. భారీ నుంచి అతి భారీ వర్షాలు!

15 Aug, 2018 17:28 IST|Sakshi

విశాఖపట్నం : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఒడిశా తీరంపై భువేనేశ్వర్‌కు ఆగ్నేయంగా 30 కి.మీ దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తా, ఉత్తర తెలంగాణకు భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

కోస్తా తీరం వెంబడి గంటకు 40 నుండి 60 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

మరిన్ని వార్తలు