గంటకు 45-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు

4 Dec, 2015 07:39 IST|Sakshi

చెన్నై: నైరుతి బంగాళాఖాతంలో లంకకు సమీపంలో స్థిరంగా అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనానికి అనుబంధంగా 4.5కి.మీ ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం ఉంది. రాయలసీమ, దక్షిణ కోస్తాలోని కొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

ఉత్తర కోస్తాలోని ఒకట్రెండు చోట్ల వర్షాలు ఉంటాయని పేర్కొంది. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. దక్షిణ కోస్తా మత్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం ఈ సందర్భంగా హెచ్చరించింది.
 

మరిన్ని వార్తలు