ముంబైని వణికించిన భారీవర్షాలు.. మరో 48 గంటలు కూడా!

22 Sep, 2016 12:30 IST|Sakshi
ముంబైని వణికించిన భారీవర్షాలు.. మరో 48 గంటలు కూడా!

దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరాన్ని భారీ వర్షాలు వణికించాయి. ఇప్పటికే పలు ప్రాంతాలు నీటమునిగి.. జనజీవనం అస్తవ్యస్తం కాగా, రాబోయే 48 గంటల పాటు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించడంతో అక్కడి పరిస్థితులు మరింత విషమించేలా ఉన్నాయి. బుధవారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ముంబైతో పాటు శివారు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిశాయి. నగరంలో 8 సెంటీమీటర్లు, శివార్లలో దాదాపు 10 సెంటీమీటర్ల వర్షం పడింది. మరికొన్ని ప్రాంతాల్లోనూ 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

దీనికంటే మరింత భారీగా వర్షాలు పతాయని రాష్ట్ర విపత్తు నివారణ సంస్థ సంయుక్త కార్యదర్శి రాజీవ్ నివట్కర్ తెలిపారు.  కొంకణ్, మరాఠ్వాడా ప్రాంతాల్లో కూడా వర్షతీవ్రత ఎక్కువగానే ఉంటుందన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తీరంలో ఉన్న ఉపరితల ఆవర్తనం మరింత బలం పుంజుకుంటోంది. దానికి తోడు అరేబియన్ సముద్రంలో ముంబై తీరంవైపు మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతోంది.  వీటి కారణంగా ముంబైతో పాటు ఉత్తర జిల్లాలైన థానె, పాల్ఘర్ జిల్లాల్లో వర్షపాతం పెరిగే అవకాశం ఉందని చెప్పారు.

మరిన్ని వార్తలు