ఢిల్లీ, నోయిడాలో భారీ వర్షం

18 Apr, 2020 19:55 IST|Sakshi

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో శనివారం ఉన్నట్టుండి వాతావరణం చల్లబడి భారీ వర్షం కురిసింది. అలాగే నోయిడాలోని పలు ప్రాంతాల్లో వడగళ్లు, ఈదురు గాలులతో కూడిన వాన కురిసింది. ఢిల్లీలో ఏప్రిల్ 20 వరకు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు ఉంటాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. నిన్న కూడా(శుక్రవారం) ఢిల్లీలో ఉష్ణోగ్రతలు తగ్గి కొంత మేర వర్షం కురవగా.. ఆదివారం కూడా ఉరుములతో కూడిన వర్షం సంభవించే అవకాశం ఉందని వాతవారణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

కాగా ఢిల్లీలో నగరంలో గరిష్టంగా 37.3 డిగ్రీలు, కనిష్టంగా 22.6 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ప్రస్తుతం ఈ వర్షానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఢిల్లీ వాసులు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. కాగా వాతావరణం చల్లబడి వర్షాలు కురుస్తుడంతో ఎక్కడ వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉంటుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

(ఉగ్రవాదుల దాడి.. ముగ్గురు జవాన్ల మృతి )

మరిన్ని వార్తలు