అలో..అలో... 

9 Apr, 2018 12:59 IST|Sakshi

మహిళా రైతులకు స్మార్ట్‌ఫోన్లు

పంపిణీ చేసేందుకు ప్రభుత్వం యోచన

ప్రకటించిన మంత్రి సూర్జోపాత్రో 

భువనేశ్వర్‌:  రాష్ట్రవ్యాప్తంగా మహిళా రైతులకు ప్రభుత్వం స్మార్ట్‌ఫోన్లు పంపిణీ చేస్తుంది. రాష్ట్ర సహకార శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం మహిళా రైతులకు స్మార్ట్‌ఫోన్లు పంపిణీ చేస్తుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ విభాగం మంత్రి సూర్య నారాయణ పాత్రో తెలిపారు. రానున్న ఖరీఫ్‌ సీజన్‌లో స్టార్ట్‌ఫోన్ల పంపిణీని  ప్రారంభిస్తారు. వ్యవసాయ రుణాలు, వాతావరణం, వ్యవసాయ ఉత్పాదనల విక్రయాలు, ఇతరేతర వ్యవసాయ సంబంధిత సమాచారం స్మార్ట్‌ఫోన్లలో లభ్యమవుతుందని మంత్రి వివరించారు.

స్మార్ట్‌ఫోన్‌ కోరుకునే వారు ఆన్‌లైన్‌లో వారి పేరు, తదితర వివరాల్ని నమోదు చేసుకోవాలని మంత్రి తెలియజేశారు. తొలి విడతలో 70 శాతం మహిళా రైతులకు స్మార్ట్‌ఫోన్లు పంపిణీ చేసేందుకు తమ విభాగం రంగం సిద్ధం చేసిందని చెప్పారు. స్మార్ట్‌ఫోన్‌ సమాచారంతో మహిళారైతులు వ్యవసాయ రంగంలో మెలకువలు తెలుసుకుని అభివృద్ధి చెందుతారు.

ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ సాగుకు వ్యవసాయ రుణాల మంజూరు కోసం  ఆ విభాగం మంత్రిత్వ శాఖ ముందస్తుగా తయారైంది. ఈ ఏడాది రూ.7,600 కోట్లు వ్యవసాయ రుణాలుగా మంజూరు చేస్తారని మంత్రి తెలిపారు. ఈ మేరకు పత్రికా ప్రకటనలు కూడా జారీ చేశామన్నారు. రైతులు తమ వివరాల్ని నమోదు చేసుకోవాలని మంత్రి అభ్యర్థించారు. 

మరిన్ని వార్తలు