మీ సహాయం ఎంతో మందికి స్ఫూర్తి కావాలి

3 Apr, 2020 20:52 IST|Sakshi

సాక్షి, వెబ్‌డెస్క్‌ : కష్టాల్లో ఉన్నప్పుడే మనిషి విలువ తెలుస్తుందంటారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా మహమ్మారి కోట్లాది మందికి కష్టాలు తెచ్చిపెట్టింది. లాక్‌డౌన్ వల్ల ఎన్నో జీవితాలు అతలాకుతలమయ్యాయి. చేయడానికి పనిలేదు. తినడానికి తిండి లేదన్నట్టు ఎంతోమంది జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి. ఈ తరుణంలో మేమున్నామంటూ చాలా మంది సామాజిక సేవా దృక్పథంతో ముందుకొస్తున్నారు. ఎవరికి సాధ్యమైనంత మేరకు వారు తోచిన సహాయాన్ని అందిస్తున్నారు.  ఆకలితో అలమటిస్తున్న వారి కోసం నాలుగు ముద్దలు పెడుతుంటే కొందరు ఆర్థిక సహాయం అందిస్తున్నారు.  మరికొందరు వీధుల్లో మూగ జీవాల కడుపునింపుతున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలకు అండగా నిలుస్తున్న ఆపద్భాందవులు, సామాజిక సేవా కార్యక్రమాల్లో నిమగ్నమైన సేవాతత్పరులు... ఎంతో మంది ముందుకొచ్చారు. అలాంటి వారు తమ కార్యక్రమాలను తెలియజెప్పి నలుగురికి స్పూర్తిగా నిలిస్తే మంచిదని సాక్షి భావిస్తోంది. 

ఈ ఆపత్కాలంలో మీరు అందిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల గురించి మాకు రాయండి. సాక్షి ద్వారా నలుగురిలో స్పూర్తి నింపడానికి రెండు నిమిషాలు సమయం కేటాయించండి. మీరందించిన సహాయ సహకారాల గురించి మాకు రాయండి. ఆ వివరాలతో పాటు మీ పేరు, ప్రాంతం, ఫోన్‌ నంబర్‌, తగిన ఫోటోలు... సమగ్రంగా పంపించగలిగితే వాటిని సాక్షి వెబ్‌సైట్‌లో (www.sakshi.com) ప్రచురిస్తాం. మీకు సంబంధించిన పూర్తి వివరాలను webeditor@sakshi.com కు పంపించండి. నలుగురికి స్ఫూర్తిగా నిలవండి.

మరిన్ని వార్తలు