హేమకు మరో పెద్ద గండం తప్పింది

1 May, 2016 09:00 IST|Sakshi
హేమకు మరో పెద్ద గండం తప్పింది

మధుర: ప్రముఖ బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలినికి పెద్ద గండం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారు వెనకాలే సెక్యూరిటీగా వస్తున్న రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. అందులో ఒక కారు హేమ కారును తాకుతూ ముందుకు వెళ్లి ఆగి తృటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటన మధురలోని జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. అదృష్టంకొద్ది ఈ ఘటనలో ఆమెకు ఎలాంటి హానీ జరగలేదు. ప్రమాదం విషయం తెలియగానే అక్కడికి చేరుకున్న పోలీసులు హేమ మాలిని బానే ఉన్నారని ప్రకటన చేశారు.

దీన్ దయాల్ ఉపాధ్యాయ్ వెటర్నరీ యూనివర్సిటీ, గావ్ అనుసంధాన్ కేంద్ర ప్రారంభకార్యక్రమాలకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 'ఎంపీ హేమమాలిని ప్రయాణిస్తున్న కారు వెనుకాలే రక్షణగా వస్తున్న వాహనాలు ఒక్కసారిగా బ్రేక్ చేయగా అందులోని ఒక కారు హేమ ఉన్న కారును తాకుతూ ముందుకు వెళ్లింది. అయితే హేమకు ఎలాంటి నష్టం జరగలేదు' అని పోలీసులు చెప్పారు. గత ఏడాది రాజస్థాన్లో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఓ ఐదేళ్లపాప చనిపోగా హేమమాలినితో సహా ఐదుగురు గాయాలపాలయ్యారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు