'అసలు నన్నెందుకు టార్గెట్ చేస్తున్నారు'

6 Jun, 2016 11:54 IST|Sakshi
'అసలు నన్నెందుకు టార్గెట్ చేస్తున్నారు'

ఆగ్రా: మథుర అల్లర్ల విషయంలో తాను చేసిన వ్యాఖ్యలను అనవసరంగా రాద్ధాంతం చేశారని బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ హేమ మాలిని అన్నారు. 'మీడియాతో సహా ప్రతి ఒక్కరూ ఎలాంటి నిజనిజాలు తెలుసుకోకుండా తన చిత్తశుద్ధిని శంకిస్తున్నారు. నన్ను టార్గెట్ చేసుకున్నారు. ఘర్షణలకు సంబంధించిన సమాచారం నాకు తెలియగానే వెళ్లి అధికారులను కలిశాను. అలాగే, బాధితులను కూడా పరామర్శించాను. అక్రమంగా కొందరు వ్యక్తులు స్వాధీనం చేసుకున్న క్వార్టర్స్ విషయంలో చర్యలు తీసుకోవాలని నేను రెండు నెలల కిందట మధుర జిల్లా మెజిస్ట్రేట్ రాజేశ్ కుమార్ను కలిసి చెప్పాను.

ఈ విషయంలో ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు విఫలమైనట్లే. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టం' అని ఆమె చెప్పారు. జరుగుతున్న హింసను, బాధిత ప్రజల గురించి సమాచారం అందజేయకుండా వాళ్లు(మీడియా-సోషల్ మీడియా) తనను టార్గెట్ చేసుకున్నారని విమర్శించారు. మీడియా ఇలాంటి ఘటనల వెనుక నిజనిజాలు కచ్చితంగా తెలుసుకోవాలని, కానీ, అలా తెలుసుకునే ప్రయత్నం చేయకుండా తనను టార్గెట్ చేయడం సబబుకాదన్నారు. తాను మథుర, బృందావనంకోసం ఎంతో పనిచేస్తున్నానని, అక్కడే ఎక్కువ సమయం గడుపుతున్నానని చెప్పారు.

>
మరిన్ని వార్తలు