కోతుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన హేమా మాలిని

11 Apr, 2019 19:15 IST|Sakshi

లక్నో : మథుర బీజేపీ ఎంపీ అభ్యర్థి హేమా మాలిని ఎన్నికల ప్రచారంలో భాగంగా సుధామ కుతిలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులతో ముచ్చటించిన హేమా మాలిని పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోతుల సమస్య గురించి చర్చిస్తూ.. ‘కోతులు ఎక్కడికి వెళ్తాయి. అవి కూడా మనతోపాటే ఉండాలి. అసలు సమస్య ఏంటంటే.. ఇక్కడికి వచ్చే పర్యాటకులు కోతులకు సమోసా, ఫ్రూటీ ఇచ్చి వాటిని చెడగొడుతున్నారు. కోతులకు ఇలాంటి ఆహారం ఇవ్వకూడదు. కేవలం పండ్లు మాత్రమే ఇవ్వండి’ అని పేర్కొన్నారు.

అంతేకాక కోతుల సమస్య అంతటా ఉందని హేమా మాలిని తెలిపారు. ఓమాక్స్‌ హౌసింగ్‌లో తనకొక చిన్న ఇల్లు ఉందని.. అక్కడ కూడా కోతుల సమస్య చాలా ఎక్కువగా ఉందన్నారు. ఈ నెల 1న ఎన్నికల ప్రచారం ప్రారంభించిన హేమా మాలిని..దానిలో భాగాంగా వ్యవసాయ క్షేత్రంలో మహిళా కూలీలతో కలిసి గోధుమ పంటని కోసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తీసిన ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో కోతల మాలిని అంటూ నెటిజన్లు ఆమెని ట్రోల్‌ చేశారు.

>
మరిన్ని వార్తలు