క్యూ కట్టిన ఏనుగులు.. ఎందుకో తెలుసా?

12 Sep, 2019 12:48 IST|Sakshi

ఏనుగుల మంద దారి తప్పి ఊర్లోకి వచ్చింది. తిరిగి అడవికి వెళ్లాలంటే సరైన మార్గం కనిపించలేదు. దీంతో గజరాజుల గుంపుకు ఏ వైపుకు వెళ్లాలో దిక్కు తోచక రోడ్డుకు ఓ పక్కగా నిలబడి ఉన్నాయి. కనుచూపు మేరలో ఏ దారి కనిపించకపోయేసరికి తప్పని పరిస్థితిలో అక్కడే ఉన్న గోడ దూకి అడవిలోకి వెళ్లాలని భావించాయి. వరుస పెట్టి ఒక్కో ఏనుగు అతి కష్టం మీద గోడ దూకి అడవి తల్లి ఒడికి చేరుకున్నాయి. ఈ గుంపులో ఉన్న ఓ వృద్ధ ఏనుగు తన కూనను గోడ దాటించడానికి నానా కష్టాలు పడింది.

ఎలాగోలా గోడ దాటిన ఏనుగుల మంద బతుకు జీవుడా అనుకుంటూ అడవి బాట పట్టాయి. కర్ణాటకలోని హస్సూర్‌ గ్రామంలో చోటుచేసుకున్న పాత వీడియోను ఐఎఫ్‌ఎస్‌ అధికారి ప్రవీన్‌ కశ్వన్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోపై పలువురు నెటిజన్లు విచారం వ్యక్తం చేశారు. దారి తెలీని నిస్సహాయ స్థితిలో అతి కష్టం మీద గోడను దూకడం నెటిజన్ల మనసును కలిచివేసింది. మనుషులే వాటి దుస్థితికి కారణమని ఓ నెటిజన్‌ వాపోయాడు. గజరాజుల మంద అడ్డుగా నిలిచిన గోడలను దూకి మరీ ప్రకృతి ఒడిలోకి చేరుకున్నాయని మరో నెటిజన్‌ కామెంట్‌ చేశారు.

మరిన్ని వార్తలు