ఒబామా పర్యటనకు భారీ భద్రత

18 Jan, 2015 20:45 IST|Sakshi
ఒబామా పర్యటనకు భారీ భద్రత

న్యూఢిల్లీ: ఒబామా భారత పర్యటన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశ రాజధాని ఢిల్లీలో కనీవినీ ఎరుగని భద్రతా ఏర్పాట్లు చేసింది. కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ పర్యవేక్షణలో ఏడంచెల నిఘా వ్యవస్థ, ప్రత్యేక రాడార్లతో గగనతల నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఢిల్లీ వీధుల్లో పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. నిరంతరం కంట్రోల్ సిస్టం ద్వారా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు.

 ఒబామా వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఆగ్రా, న్యూఢిల్లీలలో భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. అంతేకాకుండా నగరంలోని అనుమానిత ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి తీవ్రవాద నిరోధక బలగాలను మోహరించారు. నగర వ్యాప్తంగా 15 వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా 80 వేల మంది సాధారణ పోలీసు సిబ్బందిని, 20 వేల మంది పారామిలిటరీ బలగాలను మోహరించారు.

>
మరిన్ని వార్తలు