ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లో ఏం జరుగుతోంది

6 Aug, 2019 10:14 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో అక్కడ భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో అని రాష్ట్ర ప్రజలు భయపడుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరకుండా భద్రతా దళాలు మరింత అప్రమత్తమయ్యాయి. రాష్ట్రమంతటా  144 సెక్షన్‌ కొనసాగుతోంది. శ్రీనగర్‌తో పాటు జమ్మూ, రెశాయ్‌, దోడా జిల్లాల్లో నిషేధాజ్ఞలు అమలు చేశారు. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా అదనపు బలగాలను మోహరించారు.  పాకిస్తాన్‌ దాడులు నిర్వహించే అవకాశం ఉందని భావించిన కేంద్రం, పీఓకేలో భారీగా సైన్యాన్ని మోహరించింది. పాక్‌ నుంచి వచ్చే ఏ ప్రతిచర్యనైనా తిప్పికొట్టడానికి సైన్యం సిద్ధంగా ఉందని సైనికవర్గాలు తెలిపాయి. ఆర్మీ ప్రధానాధికారులంతా జమ్మూ కశ్మీర్‌లో జరుగుతున్న పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నారు. కేంద్రం సైన్యానికి పూరి​ స్వేచ్ఛనిచ్చింది. కశ్మీర్‌ లోయలో పాక్‌ హింసకు, ఐఈడీ పేలుళ్లకు పాల్పడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఏ సమయంలోనూ పరిస్థితిని చేజారనివ్వమని ఓ సీనియర్‌ మిలిటరీ అధికారి తెలిపారు.  

 జమ్మూ కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రులు, పీడీపీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నాయకులు మెహబూబా ముఫ్తీ, ఒమర్‌ అబ్దుల్లా, సజ్జాద్‌లోన్‌తో సహా వేర్పాటువాదులంతా ఇంకా  గృహనిర్భంధంలోనే కొనసాగుతున్నారు. ఇంటర్‌నెట్‌, కమ్యూనికేషన్‌ సర్వీసులు రద్దు చేశారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి.  జమ్మూకశ్మీర్‌ వ్యవస్థీకరణ బిల్లు పూర్తిగా చట్టంగా మారేవరకు ఎవరు సంబరాలు నిర్వహించరాదని బీజేపీ అధిష్టానం ఆదేశించింది. 

కాగా నేడు లోక్‌సభలో ఆర్టికల్‌ 370 రద్ధు తీర్మానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. జమ్మూకశ్మీర్‌ వ్యవస్థీకరణ బిల్లు, రిజర్వేషన్‌ బిల్లుపై లోక్‌సభలో చర్చ జరగనుంది. లోక్‌సభలో స్పష్టమైన మెజార్టీతో ఉండడంతో ఈ బిల్లులను బీజేపీ సునాయసంగా నెగ్గనుంది. రేపు జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

జమ్మూ కశ్మీర్‌ బిల్లు : కేంద్రం తీరుపై దీదీ ఫైర్‌

ఆర్టికల్‌ 370 రద్దు; తొలిసారి రాహుల్‌ స్పందన

అసెంబ్లీ అనుమతి లేకుండా ఎలా రద్దు చేస్తారు?

ఆర్టికల్‌ 370 : అమిత్‌ షా వర్సెస్‌ అధీర్‌ రంజన్‌

అఫ్రిది వ్యాఖ్యలను తిప్పికొట్టిన గంభీర్‌

కశ్మీర్‌ గ్రౌండ్‌ రిపోర్ట్‌ : అంతా నార్మల్‌..

కశ్మీర్‌ కోసం ప్రాణాలైనా అర్పిస్తా: అమిత్‌ షా

ఆర్టికల్‌ 370 రద్దుపై కమల్‌హాసన్‌ కామెంట్‌

కశ్మీర్‌ సమస్యను పరిష్కరించేది మోదీనే: ముఫ్తి!!

లోయలోకి వ్యాన్‌: ఎనిమిది మంది చిన్నారుల మృతి

అప్‌డేట్స్‌: రాముడు అయోధ్యను వదులుకోనట్టే.. కశ్మీర్‌ను

దట్టంగా కమ్ముకున్న మేఘాలు.. ఢిల్లీలో భారీ వర్షం

రాజీవ్‌ రికార్డును దాటేస్తారేమో!?

కశ్మీర్‌ అంశంపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే హర్షం

‘అసలు అలా ఎందుకు జరగలేదు’

అయోధ్యపై సయోధ్య సాధించేలా..

భారీ అగ్నిప్రమాదం : ఆరుగురు మృతి

టైమ్‌ బాగుందనే..

కశ్మీరీల్లో ఆగ్రహం.. ఆందోళన!

కశ్మీర్‌ వ్యూహం వెనుక ఆ ముగ్గురు

పండిట్ల ఘర్‌ వాపసీ!

హిందూ రాజు ముస్లిం రాజ్యం

నాలుగు యుద్ధాలు

కేంద్ర పాలిత ప్రాంతాలుగా జమ్మూకశ్మీర్, లదాఖ్‌

కశ్మీర్‌ పిక్చర్‌లో నాయక్‌ – ఖల్‌నాయక్‌

జమ్మూకశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు మద్దతు

ఆవిర్భావం నుంచి రద్దు వరకు..

కల నెరవేరింది! 

ప్రపంచ మీడియాకు హెడ్‌లైన్స్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సెన్సార్‌ సమస్యల్లో కాజల్‌ ‘క్వీన్‌’!

‘లాయర్‌ సాబ్‌’గా బాలయ్య!

‘సాహో’కి సైడ్‌ ఇచ్చినందుకు థ్యాంక్స్‌

వాల్మీకి సెట్‌లో ఆస్కార్‌ విన్నర్‌!

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తరువాత ఆ డైరెక్టర్‌తో!

చట్రంలో చిక్కిపోతున్నారు!