‘బెట్టింగ్‌ను చట్టబద్ధం చేస్తే నేరాలు పెరుగుతాయి’

29 Oct, 2017 04:34 IST|Sakshi

న్యూఢిల్లీ: పందెం, జూదంను చట్టబద్ధం చేస్తే దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రజలు వాటికి అలవాటు పడే అవకాశం ఉందని న్యాయ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ బల్వీర్‌ సింగ్‌ చౌహాన్‌ శనివారం అన్నారు. తత్ఫలితంగా నేరాల సంఖ్య పెరిగిపోతుందనీ, సమాజం గాడి తప్పుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఆలిండియా గేమింగ్‌ సమిట్‌–2017’లో జస్టిస్‌ బల్వీర్‌ మాట్లాడారు.

‘దేశంలో నాలుగింట ఒక వంతు జనాభా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారే. వారి ఆదాయం చాలా తక్కువ. జూదం, బెట్టింగ్‌కు వారు ఆకర్షితులు అయ్యే అవకాశాలు పుష్కలం. అదే జరిగితే పర్యవసానాలు మొత్తం సమాజంపై పడతాయి. ఆ పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. నేరాలు, హింస పెరుగుతాయి’ అని ఆయన వివరించారు. దేశంలో క్రికెట్‌ పందేలను చట్టబద్ధం చేసే అంశాన్ని న్యాయ కమిషన్‌ పరిశీలిస్తోంది.  

మరిన్ని వార్తలు