జయలలితపై హిజ్రా పోటీ

6 Apr, 2016 06:45 IST|Sakshi
జయలలితపై హిజ్రా పోటీ

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం జయలలితపై సామాజిక కార్యకర్త అయిన ఓ హిజ్రా పోటీకి సిద్ధమైంది. సినీ దర్శకుడు సీమన్‌కు చెందిన ‘నామ్ తమిళార్ కచ్చి(ఎన్‌టీకే)’ పార్టీ తరపున ఆర్‌కేనగర్‌లో తాను పోటీచేస్తున్నట్లు 33 ఏళ్ల జి.దేవి చెప్పారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో ఆర్‌కే నగర్ నియోజకవర్గం సమస్యల వలయంగా మారిందని దేవి ఆరోపించారు. ఎన్నికల్లో గెలిస్తే నియోజకవర్గంలో ప్రజారోగ్యం, విద్యకు ప్రాధాన్యమిస్తానని చెప్పారు.

సేలం జిల్లాలోని మగుదంచావడిలో పెరిగిన దేవి 12వ తరగతి వరకు చదువుకుంది. దేవి ప్రస్తుతం 200 మంది పేదవిద్యార్థుల చదువు కోసం తన వంతు సాయమందిస్తోంది. దాదాపు 60 మంది వృద్ధులు, అనాథల బాగోగులు తనే చూసుకుంటోంది. ‘ఎదురువారికి సాయం చేసేందుకు దేవుడు మనల్ని ఇలా ప్రత్యేకంగా సృష్టించాడు. నాకు పిల్లలు లేరు. అందుకే వీరందరికీ ఒక తల్లిగా బాధ్యత తీసుకున్నాను. జీవితాంతం సేవ చేస్తాను’ అని దేవి వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు