విద్యార్థులకు సీఎం ల్యాప్ టాప్ లు

1 May, 2016 18:17 IST|Sakshi

సుందర్ నగర్: చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 86 మంది విద్యార్థులకు హిమచల్ ప్రదేశ్ సీఎం వీరభద్ర సింగ్ ఆదివారం ల్యాప్ టాప్ లు అందజేశారు. 'రాజీవ్ గాంధీ డిజిటల్ యోజన' పథకాన్ని ఆయన ప్రారంభించారు. టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షల్లో అగ్రశ్రేణిలో ఉత్తీర్ణులైన 10 వేల మందికి ల్యాప్ టాప్ ఇవ్వనున్నట్టు ఈ సందర్భంగా వీరభద్ర సింగ్ తెలిపారు. ఇందుకోసం రూ.18.32 లక్షలు ఖర్చు పెడుతున్నట్టు చెప్పారు.

విద్యార్థులకు తమ ప్రభుత్వం నాణ్యమైన విద్య అందిచేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోందన్నారు. గత మూడేళ్లలో వెయ్యికి పైగా పాఠశాల్లో నాణ్యతా ప్రమాణాలు మెరుగుపరిచినట్టు తెలిపారు. 24 ఐటీఐలు, రెండు ఇంజినీరిగ్ కాలేజీలు ఏర్పాటు చేశామని, మండి జిల్లాలోని సుందర్ నగర్ లో 30 పాఠశాలలను ఆధునీకరించామని చెప్పారు.

మరిన్ని వార్తలు