‘గోవుల సంరక్షణ కోసం రూ. 25 వేలు’

31 Jan, 2020 17:26 IST|Sakshi

సాక్షి, మెదక్ : సేంద్రియ ఎరువులతో వ్యవసాయం చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ సూచించారు. కౌడిపల్లి మండలం తునికి గ్రామంలోని కృషి విజ్ఞాన కేంద్రాన్నిశుక్రవారం గవర్నర్‌ సందర్శించారు. ఈ సందర్భంగా సేంద్రియ ఎరువులతో సాగుచేస్తున్న పంటలను, తయారు చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ.. సేంద్రీయ పద్దతుల ద్వారా వ్యవసాయం చేస్తే బంగారు తెలంగాణ సాధ్యమవుంతుందని అన్నారు. రైతులు పండించిన  పంటకు  సరైన గిట్టుబాటు ధర వస్తే ఆత్మహత్యలు ఉండవని తెలిపారు. రైతులు నూతన పద్ధతులను అవలంభిస్తూ వ్యవసాయం చెయ్యాలని సూచించారు.

హిమాచల్ ప్రదేశలొ గోవుల సంరక్షణ కోసం రూ.25 వేలు ఇస్తున్నట్లు గవర్నర్‌ తెలిపారు. రైతులు సేంద్రియ ఎరువులు ఉపయోగించాలని, భూసార పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు. రసాయన ఎరువులతో రైతులు అనారోగ్యాల పలు అవుతున్నారని, సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసేందుకు మహిళ రైతులకు అవగాహన కల్పించాలని బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు