అయోధ్య తీర్పు: వారికి 5 ఎకరాలు ఎలా ఇస్తారు?

9 Dec, 2019 15:01 IST|Sakshi
నవంబర్ 9న అయోధ్య తీర్పు తర్వాత సుప్రీంకోర్టు వెలుపల హిందూ, ముస్లింలు (ప్రతీకాత్మక చిత్రం)

న్యూఢిల్లీ: అయోధ్యలో రామ జన్మభూమి- బాబ్రీమసీదు వివాదాస్పద స్థలానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సోమవారం హిందూ మహాసభ రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసింది. దీంతో సుప్రీంకోర్టు వెలువరించిన చారిత్రక తీర్పుపై సమీక్ష కోరుతూ 7 పిటిషన్లు దాఖలయ్యాయి. సుప్రీం కోర్టులో ముస్లింలు ఇప్పటివరకూ 6 రివ్యూ పిటిషన్లు దాఖలు చేయగా.. హిందువుల నుంచి తొలి రివ్యూ పిటిషన్‌ దాఖలైంది. ముస్లింలకు అయోధ్యలోని ప్రముఖ ప్రాంతంలో మసీదు నిర్మాణం కోసం 5 ఎకరాల స్థలం కేటాయించాలని ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ హిందూ మహాసభ రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేసింది. కాగా డిసెంబర్‌ 2న తొలి రివ్యూ పిటిషన్‌ను ఉత్తరప్రదేశ్‌లోని జామియత్‌
ఉలామా-ఏ-హింద్‌కు అధ్యక్షుడైన సయ్యద్‌ అష్షద్‌ రషీదీ దాఖలు చేశారు. 

రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం  2.77 ఎకరాల వివాదాస్పద స్థలంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన ట్రస్ట్‌ ఆధ్వర్యంలో రామ మందిరం నిర్మాణం జరగాలని, ప్రతిగా ముస్లింలకు అయోధ్యలోని ప్రముఖ ప్రాంతంలో మసీదు నిర్మాణం కోసం 5 ఎకరాల స్థలం కేటాయించాలని నవంబర్‌ 9న సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు