తాజ్‌మహల్‌ దగ్గర శివపూజ

24 Oct, 2017 16:01 IST|Sakshi

ఆగ్రా : ప్రపంచ వింతల్లో ఒకటిగా గుర్తింపు పొందిన తాజ్‌మహల్‌ చుట్టూ వివాదాల పరంపరకు ఇప్పట్లో ఫుల్‌స్టాప్‌ పడేటట్లు కనిపించడం లేదు. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం రూపొందించిన పర్యాటక ప్రాంతాల జాబితా నుంచి తాజ్‌మహల్‌ను తొలగించడంతో మొదలైన వివాదం.. రోజుకో కొత్త మలుపు తిరిగుతోంది. తాజాగా..  సోమవారం అతివాద హిందూభావజాలంతో ఉన్న ఇద్దరు యువకులు తాజ్‌మహల్‌ దగ్గర శివచాలీసా పూజను మొదలు పెట్టారు. అంతేకాక తాజ్‌మహల్‌ అనేది మొదట శివాలయం అని వారు పేర్కొన్నారు. చారిత్రాత్మక ప్రదేశం వద్ద శివారాధన చేయడంతో అక్కడ కొద్దిసేపు.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శివారాధన చేస్తున్న వారిని అడ్డుకునేందుకు పోలీసలు ప్రయత్నించారు. ఈ సమయంలో వారు.. పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు.

తాజ్‌ దగ్గర శివారాధన చేస్తున్న యువకులను రాష్ట్రీయ స్వాభిమాన్‌ దళ్ (ఆర్‌ఎస్‌డీ), హిందూ యువ వాహిని (హెచ్‌వైవీ)కి చెందిన వారిగా అధికారులు గుర్తించారు. చివరగా సీఐఎస్‌ఎఫ్‌ బలగాలు.. వారిని అదుపులోకి తీసుకుని.. స్థానికి పోలీసులకు అప్పంగించారు. రాతపూర్వకంగా క్షమాపణ కోరడంతో.. వారిని పోలీసులు తరువాత విడుదల చేయడం జరిగింది.

మరిన్ని వార్తలు