చరిత్రలో బోస్కు.. లాలాకు చోటివ్వండి

24 Jun, 2015 18:46 IST|Sakshi
చరిత్రలో బోస్కు.. లాలాకు చోటివ్వండి

న్యూఢిల్లీ: చరిత్ర పుస్తకాల్లో ప్రముఖ స్వాతంత్ర్య పోరాట యోధులందరికీ తగిన ప్రాధాన్యమిస్తూ చోటివ్వాలని చరిత్ర పుస్తకాలపై నిర్వహించిన ఓ వర్క్షాప్ డిమాండ్ చేసింది. ఇప్పటికే చరిత్ర పుస్తకాలల్లో జాతిపిత మహాత్మాగాంధీ, జవహార్ లాల్ నెహ్రూకు కావాల్సిన దానికన్నా ఎక్కువే చోటు ఉందని, ఇప్పుడైనా సుభాష్ చంద్రబోస్, లాలా లజపతి రాయ్వంటి ప్రముఖ స్వాతంత్ర్య పోరాటయోధులకు చోటివ్వాలని వారిని మరువకూడదని అభిప్రాయపడింది. ఎన్సీఈఆర్టీ ఆధ్వర్యంలో 'చరిత్ర పుస్తకాలపై సమీక్ష' అనే పేరిట ఐదు రోజుల వర్క్షాప్ జరిగింది.

ప్రస్తుతం ఉన్న చరిత్ర పుస్తకాలు భావిభారత విద్యార్థులకు పరిశోధనల కోసం పెద్దగా ఉపయోగపడకపోవచ్చనే అభిప్రాయం ఇందులో పాల్గొన్నవారంతా వెలిబుచ్చారు. గాంధీ, నెహ్రూల గురించి ఆయా పుస్తకాల్లో కుప్పలుగా ఉందని అన్నారు.  ఎప్పుడూ వారివే కాకుండా లాలా లజపతిరాయ్, గోపాల్ కృష్ణ గోఖలే, బాలగంగాధర్ తిలక్, సుభాష్ చంద్రబోస్లాంటి వాళ్లు చాలా ముఖ్యమైనవారని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ (ఐసీహెచ్ఆర్) సభ్యుడు శరదిందు ముఖర్జీ అన్నారు. కాగా, ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెలువరించేందుకు మాత్రం ఎన్సీఈఆర్టీ నిరాకరించింది.

>
మరిన్ని వార్తలు