సైనికులతో చాట్‌ చేయ్యొదంటూ..

30 May, 2018 20:47 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కశ్మీర్‌లో ఆడియో క్లిప్‌ కలకలం

కశ్మీర్‌: సోషల్‌ మీడియాలో సైనికులతో చాటింగ్‌ చేయ్యెద్దంటూ ఇస్తామిక్‌ ఉగ్రవాద సంస్థ ‘ హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ’ కశ్మీర్‌ యువతులకు పిలుపునిచ్చింది. ఈ మేరకు హిజ్బుల్‌ ముజాహిదీన్‌ కమాండర్‌ రియాజ్‌ నైకో ఓ ఆడియో క్లిప్పును విడుదల చేశారు. ఆ ఆడియో క్లిప్‌ ఇప్పుడు కశ్మీర్‌లో వైరల్‌ అయింది. ‘  భద్రతా దళాలు, పోలీసులు కశ్మీర్‌ యువతులో సంబంధం ఏర్పాటు చేసుకొని మా గురించి సమాచారం లాగుతున్నారు. ముఖ్యంగా పాఠశాల యువతను టార్గెట్‌ చేశారు. వారితో సోషల్‌ మీడియా ద్వారా పరిచయం చేసుకొని అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. 

అపరిచితులతో పరిచయాలు పెంచుకోకండి. మీతో చాట్‌ చేసి మిమ్మల్ని బలిపశువుల్ని చేస్తున్నారు. వారు అడిగిన సమాచారం చెప్పకపోతే మీ రహస్యాలు బయటపెడతామని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు. సోదరీమణులారా జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లల్ని సోషల్‌ మీడియాకి దూరంగా ఉంచండి. మీ పిల్లలు భద్రతా దళాలతో సంబంధాలు పెట్టుకుంటే మిమ్మల్ని మేము విడిచిపెట్టం జాగ్రత్త’  అని హెచ్చరిస్తూ ఉన్న పది నిమిషాల ఆడియో క్లిప్ జమ్మూ-కశ్మీర్‌లో వైరల్‌ అయింది. ఈ ఆడియో క్లిప్‌ను అందరికి షేర్‌ చేయాలని కూడా రియాజ్‌ నైకో కశ్మీర్‌ యువతను కోరారు. 

కాగా కొద్దిరోజుల క్రితం ఆర్మీ మేజర్‌ నితిన్‌ లీతుల్‌ గోగోయ్‌ శ్రీనగర్‌లోని ఓ హోటల్‌లో ఓ యువతతో పట్టుబడిన విషయం తెలిసిందే. సోషల్‌ మీడియా ద్వారానే వారు పరిచయం అయ్యారు.ఈ నేపథ్యంలోనే ఉగ్రవాద సంస్థ ఆడియో క్లిప్‌ ను విడుదల చేసింది. గోగోయ్‌ విషయాన్ని కూడా ఆడియో క్లిప్‌లో గుర్తుచేశారు.

>
మరిన్ని వార్తలు