'అక్రమ నిల్వల వల్లే ఉల్లి ధరల మంట'

4 Jul, 2014 11:26 IST|Sakshi
'అక్రమ నిల్వల వల్లే ఉల్లి ధరల మంట'

అక్రమ నిల్వల వల్లే ఉల్లిపాయల ధరలు పెరుగుతున్నాయని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. శుక్రవారం ఆయన ధరల పెరుగుదలపై మీడియాతో మాట్లాడారు. ప్రతియేటా జూలై నుంచి డిసెంబర్ మధ్య కాలంలో కొన్ని కూరగాయలు, ఇతర ఆహార ధరలు పెరడం సాధారణం అయిపోయిందని చెప్పారు.

అక్రమంగా నిల్వ ఉంచేవాళ్లపై చర్యలు తీసుకుంటే ఇలా జరగదని ఆయన అన్నారు. రుతుపవనాలు కాస్త ఆలస్యం అవుతున్నాయన్న విషయం తెలిసి ఇలా అక్రమంగా నిల్వ ఉంచేవాళ్లు మరింత రెచ్చిపోతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు అక్రమ నిల్వదారులపై చర్యలు తీసుకోవాలని, వాటికి కేంద్రం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. అయినా.. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఉల్లిపాయల ధరలు కాస్త తక్కువగానే ఉన్నాయని, అందువల్ల మరీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జైట్లీ వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు