ఇక‌పై మ‌ద్యం హోం డెలివ‌రీ..ఇవిగో టైమింగ్స్‌

6 May, 2020 14:00 IST|Sakshi

ఛండీగ‌ర్ : కేంద్రం ఇచ్చిన స‌డ‌లింపుల నేప‌థ్యంలో అనేక రాష్ర్టాల్లో మ‌ద్యం విక్ర‌యాలు జోరుగా సాగుతున్నాయి. సామాజిక దూరం పాటించాలన్న నిబంద‌న‌లు గాలికొదిలేసి మ‌ద్యం ప్రియులు అత్యుత్సాహం చూపిస్తున్న ఘ‌ట‌న‌లు అనేకం. ఈ నేప‌థ్యంలో క‌రోనా వ్యాప్తిని నివారించే చ‌ర్య‌ల్లో భాగంగా పంజాబ్ ప్ర‌భుత్వం బుధ‌వారం  కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కొన్ని నిబంధ‌న‌ల మ‌ధ్య మ‌ద్యం విక్ర‌యాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తూనే హామ్ డెలివ‌రీకి అనుమ‌తినిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. ఉద‌యం 9 గంట‌ల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు మాత్ర‌మే మ‌ద్యం విక్ర‌యాలు జ‌ర‌పాలి. అదే విధంగా మధ్యాహ్నం 1 నుంచి 6 గంటల వర‌కు  డోర్ డెలివ‌రీకి అనుమ‌తిస్తామ‌ని పంజాబ్ ముఖ్య‌మంత్రి అమ‌రీంద‌ర్ సింగ్ ప్ర‌క‌టించారు. (మద్యంబాబులకు షాక్‌.. షాప్స్‌ క్లోజ్‌ )

నిబంధ‌న‌లు పాటించ‌కపోతే మ‌ద్యం షాపుల లైసెన్సుల‌ను ర‌ద్దు చేస్తామ‌ని తెలిపారు. చాలా ప్రాంతాల్లో  అధిక ర‌ద్దీ కార‌ణంగా, సామాజిక దూరం పాటించ‌డం లేద‌ని దీని ద్వారా క‌రోనా వ్యాప్తి చెందే అవ‌కాశం ఉన్నందున  లిక్క‌ర్ డోర్ డెలివ‌రీకి అనుమ‌తిస్తున్నమ‌ని వివ‌రించారు. ఇక  ఛ‌త్తీస్‌ఘ‌డ్‌లోనూ గ్రీన్‌జోన్ల‌లో ఆన్‌లైన్ ద్వారా మ‌ద్యం పంపిణీకి ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఛ‌త్తీస్‌గ‌డ్ స్టేట్ మార్కెటింగ్ కార్పోరేష‌న్ లిమిటెడ్ (సీఎస్ఎంసీఎల్ ) అనే యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని ఆన్‌లైన్‌లో ఆర్డ‌ర్ ఇవ్వొచ్చు.  (మద్యం డోర్‌ డెలివరీ : అందుబాటులో యాప్ )


 

మరిన్ని వార్తలు