పౌరసత్వ రగడ : రాహుల్‌కు హోం శాఖ నోటీసులు

30 Apr, 2019 11:19 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :  కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీకి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. రాహుల్‌ పౌరసత్వంపై 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని హోం శాఖ కోరింది. బీజేపీ రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఫిర్యాదు ఆధారంగా రాహుల్‌కు నోటీసులు జారీ అయ్యాయి. రాహుల్‌ గాంధీకి నాలుగు పాస్‌పోర్ట్‌లున్నాయని, ఒకదానిపై ఆయన పేరు రౌల్‌ విన్సీ, క్రిస్టియన్‌గా నమోదైందని సుబ్రఃహ్మణ్య స్వామి ఇటీవల ఆరోపించారు. కాగా రాహుల్‌ పౌరసత్వంపై వివాదం నేపధ్యంలో ఈసీ ఇటీవల రాహుల్‌ నామినేషన్‌ పత్రాలను ఆమోదించడంతో కాంగ్రెస్‌ వర్గాలు ఊపిరిపీల్చుకున్నాయి.

మరోవైపు రాహుల్‌ పౌరసత్వంపై ఆమేధిలో ఆయనపై స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేసిన ధ్రవ్‌లాల్‌ సైతం ఫిర్యాదు చేశారు. బ్రిటన్‌లో ఓ కంపెనీ నమోదు సమయంలో రాహుల్‌ గాంధీ తాను బ్రిటన్‌ పౌరుడినని ప్రకటించుకున్నారని ధ్రువ్‌లాల్‌ న్యాయవాది రవిప్రకాష్‌ పేర్కొన్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం భారతీయేతరులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులని చెప్పారు. 
 

>
మరిన్ని వార్తలు