బోర్డర్‌ పరిస్థితిపై హోంశాఖ సమీక్ష

27 Feb, 2019 12:17 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో నెలకొన్న యుద్ధ వాతావరణంపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సమీక్షించింది. సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితిని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఉన్నతాధికారులతో బుధవారం మధ్యాహ్నం సమీక్షించారు. పాకిస్తాన్‌ యుద్ధవిమానాలు భారత గగనతలంలోకి చొచ్చుకురాగా, భారత దళాలు నౌషెరాలో పాక్‌ ఎఫ్‌ 16 జెట్‌ను కూల్చివేశాయి.

భారత గగనతలంలోకి చొచ్చుకువచ్చిన పాక్‌ యుద్ధవిమానాలను భారత వైమానిక దళం దీటుగా తిప్పికొట్టింది. భారత్‌ ప్రతిఘటనతో పాక్‌ యుద్ధవిమానాలు వెనుతిరిగాయి. మరోవైపు పాక్‌ నుంచి ఎలాంటి కవ్వింపు ఎదురైనా దీటుగా ప్రతిస్పందించేందుకు భారత్‌ అప్రమత్తమైంది. జమ్మూ కశ్మీర్‌లోని పలు ఎయిర్‌బేస్‌ల నుంచి భారత వైమానిక దళం సర్వసన్నద్ధంగా ఉందని అధికారులు చెప్పారు.

మరిన్ని వార్తలు