క‌రోనా: ఇంట్లోనే చికిత్స మంచిది కాదు

9 Jun, 2020 13:29 IST|Sakshi

చెన్నై : క‌రోనా రోగుల‌కు ఇంట్లోనే చికిత్స అందించాల‌నుకోవ‌డం స‌రైన నిర్ణ‌యం కాద‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ మాజీ మంత్రి, పీఎంకే రాజ్య‌స‌భ స‌భ్యుడు అన్బుమ‌ణి రాందాస్ అభిప్రాయ‌ప‌డ్డారు. కేసుల సంఖ్య పెరుగుతుందని ఇంటికి పంపించ‌డం వ‌ల్ల మ‌రిన్ని స‌మ‌స్య‌లు త‌లెత్తె అవ‌కావం ఉంద‌ని పేర్కొన్నారు. చాలామంది ఇళ్ల‌లో ఐసోలేష‌న్ స‌దుపాయాలు ఉండ‌వ‌ని దీని వ‌ల్ల స‌మ‌స్య మ‌రింత తీవ్రం అవుతుంద‌ని తెలిపారు. పెరుగుతున్న క‌రోనా కేసుల దృష్ట్యా ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో ఐసోలేష‌న్ వార్డులు నిండిపోయాయ‌ని, కొత్తగా వైర‌స్ సోకిన వారు ఇళ్ల‌లోనే ఉండి చికిత్స పొందాల‌న్న తమిళనాడు ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు షాక్‌కి గురిచేశాయ‌న్నారు. (49 మంది ఎన్డీఆర్‌ఎఫ్ జ‌వాన్ల‌కు క‌రోనా)

చెన్నైలోని క‌ళాశాలలు,  హాస్టళ్లు, హాళ్ళు  ఇండోర్ స్టేడియంల‌ను గుర్తించి క‌రోనా బాధితులకు ట్రీట్‌మెంట్ అందించాల‌ని అన్బుమ‌ణి రాందాస్‌ రాష్ట్ర ప్ర‌భుత్వానికి విఙ్ఞ‌ప్తి చేశారు. దీని వ‌ల్ల రోగుల‌ను ఇంటికి పంపించ‌కుండా నిత్యం  వైద్యుల సంర‌క్ష‌ణ‌లో చికిత్స పొందేందుకు అవ‌కాశం ఉంటుందని తెలిపారు. ఉమ్మ‌డి కుటుంబాలు ఉన్న కొంద‌రి ఇళ్ల‌లో భౌతిక దూరం పాటించ‌డం కూడా క‌ష్ట‌మైన అంశ‌మేన‌న్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో కోవిడ్ బాధితుల్ని ఇంటికి పంపిస్తే మిగ‌తా కుటుంబ‌ స‌భ్యులకు కూడా క‌రోనా సోకే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంద‌ని తెలిపారు. 
(జ్వరం, గొంతు నొప్పితో హోం ఐసోలేషన్‌లో కేజ్రీవాల్‌)


 

మరిన్ని వార్తలు