ఇళ్లకు ‘కమలం’ రంగు

14 Jul, 2020 16:57 IST|Sakshi

ఉత్తరప్రదేశ్​లోని ప్రయాగ్​రాజ్​లో ఘటన

ప్రయాగ్​రాజ్​, ఉత్తరప్రదేశ్​: ప్రయాగ్​రాజ్​ పట్టణంలో ఓ వీధిలోని ఇళ్లకు ‘కమలం’ రంగు వేశారు. దీంతో ఓ ఇంటి యజమానికి తన అనుమతి లేకుండా మంత్రి నందగోపాల్​ నంది మనుషులు రంగులేశారని ఫిర్యాదు చేశారు. వేయొద్దన్నందుకు తనను దుర్భాషలాడారని మరో ఫిర్యాదులో పేర్కొన్నారు.

రంగులు వేసిన ఇళ్ల వీధిలోనే మంత్రి నందగోపాల్ నివాసం కూడా ఉంది. ఇందుకు సంబంధించిన ఒక నిమిషం నిడివి గల వీడియోను ఫిర్యాదుదారు రవి గుప్తా​ పోలీసులకు అందజేశారు. అందులో రవి గుప్తా దయచేసి ఆపండి అని మంత్రి మనుషులను అడగడం, వారు ఆయనపై నోరు పారేసుకున్న సంఘటనలున్నాయి.

వీధిలోని ప్రతి ఇంటిపైనా కమలం రంగు స్ప్రే చేశారని రవి ఫిర్యాదులో పేర్కొన్నారు. వద్దు ఆపమని వీడియో తీసున్న తన ఫోన్​ కెమెరాపైనా రంగు స్ప్రే చేశారని చెప్పారు. ఆ తర్వాత హిందూ మతానికి చెందిన కొన్ని సింబల్స్​ను వీధిలోని ఇళ్ల గోడలపై వేశారని తెలిపారు.

దీనిపై స్పందించిన మంత్రి నంది ఎఫ్ఐఆర్​ నమోదు తనపై చేసిన కుట్రని పేర్కొన్నారు. వీధిలో వేసింది కమలం రంగే కాదని అందులో తనకు ఆకుపచ్చ, ఎరుపు, చాక్​లెట్​ రంగులు ఉన్నాయని అన్నారు.

మరిన్ని వార్తలు