ఇది నిజమా.. ఇంతకంటే దారుణం ఉండదు

23 May, 2020 14:38 IST|Sakshi

వీధి వ్యాపారిని దోచుకోవడంపై మాజీ క్రికెటర్ల ఆవేదన

న్యూఢిల్లీ: మామిడ పండ్ల వ్యాపారం చేసుకునే ఒక పేద వీధి వ్యాపారిని కొంతమంది జనం దోచుకున్న వీడియో ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకున్న ఈ ఘటనపై నెటిజన్లు విపరీతంగా స్పందించారు. ఇది చాలా దారుణమంటూ సోషల్‌ మీడియాను హోరెత్తించారు. దీనిపై మాజీ క్రికెటర్లు ఆకాశ్‌ చోప్రా, దీప్‌దాస్‌ గుప్తాలు కూడా తమ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఇంత దారుణమా.. నేను షాకయ్యా..భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు జరగకూడదని ఆశిస్తున్నా’ అని దీప్‌దాప్‌ గుప్తా పేర్కొనగా, ‘ ఇది నిజమా..ఆ వీడియో రియలేనా. నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఒకవేళ ఇది నిజమైతే ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు’ అని ఆకాశ్‌ చోప్రా ఆవేదన వ్యక్తం చేశాడు. వీరిద్దరూ ఢిల్లీ క్రికెటర్లు కావడంతో ఈ ఘటన వారిని మరింత ఆందోళనకు గురిచేసింది.(సిగ్గు..సిగ్గు.. వీధి వ్యాపారిని దోచేసిన జనం!)

గురువారం ఢిల్లీ నగరంలో ఒక స్కూల్‌ వద్ద మామిడి పండ్లు అమ్మే పేద వీధి వ్యాపారికి మరొక వ్యాపారికి మధ్య గొడవ జరిగింది. ఆ క్రమంలోనే వారి మధ్య వాగ్వాదం పెరిగింది. ఇదే అదునుగా భావించిన కొంతమంది ఆ మామిడి పండ్లను నిమిషాల వ్యవధిలోనే లూటీ చేశారు. గొడవ ముగిసి సదరు వ్యాపారి చూసుకునే సరికి అక్కడ ఉన్న బాస్కెట్‌లో మామిడి పండ్లు అన్నీ దాదాపు ఖాళీ అయిపోయాయి. సుమారు రూ. 30 వేల విలువ గల సరుకును జనం ఇలా దోచుకోవడంపై ఆ వ్యాపారి కన్నీరుమున్నీరయ్యాడు. దీనికి సంబంధించి వీడియో వైరల్‌ అయ్యింది.(నీకు.. 3డీ కామెంట్‌ అవసరమా?: గంభీర్‌)

మరిన్ని వార్తలు